నానికి బాగా ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

26 April 2025

Basha Shek

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన న్యాచురల్ స్టార్ హీరో నానికి తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది.

మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ తర్వాత నటనవైపు దృష్టిసారించి న్యాచురల్ స్టార్ గా మారిపోయాడు నాని.

హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోన్న నాని నిర్మాతగానూ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ సొంతం చేసుకున్నాడు,

కాగా సరిపోదా శనివారం తర్వాత నాని నటించిన సినిమా హిట్ 3. శైలెష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మే 01న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు  ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నాని.

తనకు దివంగత శ్రీదేవి అంటే చాలా ఇష్టమని, ఆమె నటించిన క్షణక్షణం సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదని పేర్కొన్నాడు.

ఇక హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఇష్టమని గతంలో చెప్పుకొచ్చాడు నాని. అలాగే రవితేజ కూడా తన ఫేవరెట్ అన్నాడు.