40 ఏళ్లక్రితం పెదనాన్న మొదలెట్టిన సినిమా.! కల్కితో ఫినిష్ చేసిన ప్రభాస్
Anil Kumar
03 July 2024
ఇప్పుడంటే కల్కి 2898 AD సినిమాతో ప్రభాస్ నాగ అశ్విన్ తో హాలీవుడ్ రేంజ్ లో దిమ్మతిరిగే హిట్ కొట్టారు కానీ..
ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మాత్రం ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే కల్కి పేరుతో ఓ మూవీని మొదలెట్టారని తెలుసా.?
కొంత పార్ట్ షూట్ కూడా చేశారట. కీరవాణి అదిరిపోయే ఓ సాంగ్‌ను కూడా కంపోజ్ చేసి ఈ సినిమా కోసం ఇచ్చారట.
అయితే ఏమైందో కానీ.. ఆ సినిమా ఆగిపోయిందని.. రీసెంట్‌గా కృష్ణం రాజు భార్య శ్యామలా గారు రివీల్ చేశారు.!
దీంతో ఈమె చెప్పిన మాటలే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
కారణం ఏదైనా కానీ.. కృష్ణం రాజు ఆ సినిమా చేసి ఉంటె ఎలా ఉండేదో అని ఉహించుకున్నట్టు కామెంట్స్ వస్తున్నాయి.
ఇక యంగ్ రెబల్ స్టార్ గురించి ఈ తరానికి చెప్పాల్సిన పనే లేదు. ఏ రేంజ్ కి వెళ్లిన టాలీవుడ్ కి డార్లింగ్ నే.!
కల్కి తో మన డార్లింగ్ 500 పైనే కలెక్షన్స్ వసూళ్లు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి