ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది.. అక్షర యోధుడు అస్తమయం..
Rajitha Chanti
Pic credit - Instagram
పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి.
1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అసలు పేరు రామయ్య.
1974 ఆగస్ట్ 10న విశాఖ సాగర తీంరోల ఈనాడును ప్రారంభించారు. ఆ తర్వాత ఈటీవీ మీటీవి అంటూ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. సితార సినీ పత్రిక నిలిచారు.
సినీరంగంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి.. వివిధ భాషల్లో దాదాపు 87 సినిమాలను నిర్మించి కొత్తవారిని పరిచయం చేశారు.
సితార సినీ పత్రిక ద్వారా సినీ రంగుల ప్రపంచంలోని విశేషాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. 1976లో ఇది సినిమాల వార్తలతో ప్రజల ముందుకు వచ్చింది.
ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై మయూరి, శ్రీవారికి ప్రేమలేఖ, మౌనపోరాటం, ప్రతిఘటన, నచ్చావులే, చిత్రం, మనసు మమత, తేజ, అమ్మ, నువ్వే కావాలి చిత్రాలు నిర్మించారు.
ఉదయ్ కిరణ్, జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, తనిష్ ను హీరోలుగా వెండితెరకు పరిచయం చేశారు రామోజీ రావు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.