02 April 2024

మళ్లీ  పంత్‌ను గెలికిన ఊర్వశి.. అలాంటి కామెంట్స్ తో..

Rajitha Chanti

Pic credit - Instagram

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించింది బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతెలా.

ఆ తర్వాత  అక్కినేని అందగాడు యువ సామ్రాట్ అఖిల్ తో కలిసి ఏజెంట్ సినిమాలో స్టెప్పులేసిందీ ముద్దుగుమ్మ.

 ప్రస్తుతం బాలీవుడ్ లో జేఎయూ అనే సినిమాలో నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది ఊర్వశి రౌతెలా. త్వరలోనే  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాల సంగతి పక్కన పెడితే ఊర్వశి చేసే కొన్ని పనులు, కామెంట్లు తీవ్ర చర్చనీయాంశమవుతుంటాయి. ఆమెను వార్తల్లో నిలుపుతుంటాయి.

ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ను ఉద్దేశించి చాలా సార్లు కామెంట్స్ చేసింది ఊర్వశి. దీంతో నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురైంది.

తాజాగా పంత్ ను టార్గెట్ గా చేసుకుని మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేసిందీ బాలీవుడ్ ముద్దుగుమ్మ. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు.

 ఓ మ్యాట్రీమోని సైట్ కు సంబంధించిన యాడ్ లో 'ఎవరు కూడా నా అంత ఎత్తు కలిగిన వారు దొరకడం లేదంటూ' కామెంట్స్ చేసింది ఊర్వశి.

రిషభ్ పంత్ ను ఉద్దేశించే ఊర్వశి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.