06 November 2023

తమన్నా, విజయ్ వర్మ విడిపోయారా ??

తమన్నా ఈ మధ్య బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు. తమన్నాతో రిలేషన్ ను ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. 

బయటికి ఎక్కడికి వచ్చినా కూడా కలిసే వస్తున్నారు తమన్న, విజయ్. దాంతో త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వస్తున్నాయి. 

అయితే కొన్ని రోజులుగా తమన్నా, విజయ్ ఎక్కువగా కలిసి కనిపించడం లేదు. దాంతో ఇద్దరు విడిపోయారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. 

ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు మిల్కీ బ్యూటీ. విజయ్ కూడా అంతే. 

దానికి తోడు మొన్నామధ్య ఒక ప్రెస్ మీట్ లో భాగంగా తమన్న గురించి మాట్లాడమంటే విజయ్ వర్మ ఏ మాత్రం స్పందించకపోవడంతో విడిపోయారు అంటూ ప్రచారం ఎక్కువగానే జరిగింది. 

తాజాగా ముంబైలో ఈ మధ్యే జియో వరల్డ్ ప్లాజా అనే మాల్ మొదలైంది. దాని ఓపెనింగ్ కు తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి వచ్చారు. 

ఈ ఇద్దరు విడిపోయామని ప్రచారం చేస్తున్న వాళ్లకు తమ రొమాన్స్ తోనే సమాధానం చెప్పారు తమన్నా, విజయ్ వర్మ.