నయన్ బాటలో శ్రీలీల.. ఆ సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించేసిందా.. ?
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం బీటౌన్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది.
పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా మారింది శ్రీలీల. ఇందులో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ అదరగొట్టేసింది. దీంతో బీటౌన్ ఆఫర్స్ క్యూ కట్టాయి.
ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఆషికి 3లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సైఫ్ తనయుడు సరసన దోస్తానా 2 చిత్రంలో నటిస్తుంది.
అయితే ఇప్పుడు శ్రీలీలకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా శ్రీలీల హీరోయిన్ నయనతార బాటలో నడుస్తుందట.
నయన్ మాదిరిగానే అటు హిందీలో తన సినిమాల కోసం పారితోషికం తగ్గించుకుందట శ్రీలీల. పుష్ప2లో కిస్సిక్ పాట కోసం ఏకంగా రూ.2 కోట్లు వసూలు చేసింది.
కానీ ఇప్పుడు ఆషికి 3 సినిమాకు కోటి రూపాయలు పారితోషికం తగ్గించుకుందని టాక్. ఆమె ప్రస్తుతం ఈ సినిమా కోసం కేవలం రూ.2 కోట్లు మాత్రమే తీసుకుంటుందట.
ప్రస్తుతం హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల.. ఇప్పుడు అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది.
అలాగే ఇటు తమిళం, తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తెలుగులో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.