తప్పయితే సారీ చెప్పేస్తా!

TV9 Telugu

14 March 2024

యోగా గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడినా వెంటనే మొదట గుర్తుకొచ్చే పేరు అలనాటి సినీ కథానాయక శిల్పా శెట్టి.

ఫిజికల్‌ పిట్‌నెస్‌లో ఆమెకు చాలెంజ్‌ విసిరేవాళ్లే లేరన్నంతగా పేరు తెచ్చుకున్నారు సీనియర్ నటి శిల్పా శెట్టి.

తెలుగులోనూ వీడెవడండీ బాబూ, నాగార్జున ఆజాద్‌, భలేవాడివి బాసూ వంటి హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు.

ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. అక్కడే సినిమాల్లో నటించారు శిల్ప శెట్టి.

అక్కడే బిజినెస్‌మేన్‌ రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకున్నారు. అయితే కేవలం డబ్బుకోసమే శిల్ప అతన్ని పెళ్లి చేసుకున్నట్టు విమర్శలు వినిపించాయి.

అందులో అస్సలు నిజం లేదని ఎప్పటికి అప్పుడు ఆమె వెళ్లిన ఇంటర్వ్యూల్లో చెప్పారు సీనియర్ నటి శిల్పా శెట్టి.

తన అందం, తెలివితేటలు చూసి చాలా మంది తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని చాలాసార్లు అన్నారు నటి శిల్ప శెట్టి.

రాజ్‌ని మించిన ధనికులు కూడా తనకు ప్రపోజ్‌ చేసిన రాజ్‌లోని మంచితనం నచ్చి చేసుకున్నానని, ఇంకెప్పుడూ అర్థంపర్థం లేని నిందలు వేయొద్దని అన్నారు శిల్ప.