ప్రభాస్ సినిమాలో ప్రియాంక.. అసలు మ్యాటర్ ఇదేనా..?

Rajeev 

22 January 2025

సౌత్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ ఎదురుచూస్తోంది అందాల  హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్.

నాని గ్యాంగ్ లీడర్‌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ  బ్యూటీ 

2021లో దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహించిన వరుణ్ డాక్టర్ సినిమాతో ప్రియాంక మోహన్ తమిళ సినిమాలో నటిగా అరంగేట్రం చేసింది.

ఇటీవలే ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. 

తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాలో చేస్తుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్ వినిపిస్తుంది. హనురాఘవపుడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమాలో మరో హీరోయిన్ గా ప్రియాంకకు ఆఫర్ వచ్చిందని టాక్.