TV9 Telugu
కుష్బూ భర్త.. సౌందర్యకు ప్రపోజ్ చేశారా?
01 March 2024
సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాలు వినేకొద్దీ వినాలనిపిస్తుంటాయి. అలాంటి విషయాల్లో, అలాంటి వ్యక్తుల్లో సౌందర్య తప్పకుండా ఉంటారు.
ఆమె మనకు దూరమై ఇన్నేళ్లయినా, ఇంకా ఆమె గురించి ఎవరు, ఎక్కడ, ఏం చెప్పినా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంటుంది.
కమర్షియల్ హీరోయిన్‌గా స్టార్ హీరోల పక్కన నటించి హైట్స్ రీచ్ అయిన కథానాయకి సౌందర్య స్వతహాగా మృదుస్వభావి.
తెలుగులోనే కాదు, తమిళ్‌లోనూ టాప్ ప్రొడక్షన్ హౌసులతో కలిసి పనిచేశారు టాలీవుడ్ రెండో తారం మహానటి.
ఆమెతో పనిచేయడం తన లైఫ్‌లో మర్చిపోలేనని అంటారు డైరక్టర్ సుందర్.సి. తనకు తెలిసిన మంచి అమ్మాయిల్లో సౌందర్య ఒకరని అంటారు సుందర్.
తన జీవితంలోకి కుష్బూ కనుక రాకపోయి ఉంటే, తప్పకుండా తాను సౌందర్యకి ప్రపోజ్ చేసేవాడినని చెప్పారు సుందర్.
అంతేకాదు, సౌందర్యతో ఎప్పుడూ ఆమె అన్నయ్య ఉండేవారని, ఒక్క క్షణం కూడా విడిచి వెళ్లేవారు కాదని చెప్పారు ఆయన.
అందుకే సౌందర్యతో తనకు లాంగ్ కాన్వర్జేషన్స్ ఏవీ లేవని చెప్పారు కుష్బూ భర్త, తమిళ దర్శకుడు సుందర్.సి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి