నివేదా కోసం సీఎం కొడుకు ఖర్చుపెట్టారా?

TV9 Telugu

08 March 2024

నివేదా పేతురాజ్‌ మీద అంతంత డబ్బు ఖర్చుపెట్టారా? తమిళనాడు రాష్ట్ర సీఎం కొడుకికి అంత అవసరం ఏం వచ్చింది?

ఇద్దరి మధ్యా సమ్‌థింగ్‌ సమ్‌థింగా? అంటూ వీరిపై వచ్చిన రకరకాల వార్తలు కోలీవుడ్‌ ఇండస్ట్రీని షేక్‌ చేశాయి.

ఇలా సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలంటికి ఓ క్లారిటీ ఇచ్చేశారు క్రేజీ హీరోయిన్ నివేదా పేతురాజ్‌.

నా కోసం ఎవరో డబ్బు ఖర్చుపెట్టారని వస్తున్న వార్తలో నిజం లేదు అంటూ సోషల్‌ మీడియాలో తన వాయిస్‌ వినిపించారు.

ఇలాంటి పుకార్లపై తాను ఇప్పటిదాకా స్పందించకపోవడానికి కూడా ఒక కారణం ఉందన్నారు కథానాయక నివేదా పేతురాజ్‌.

ఎవరి గురించైనా వార్తలు రాయడానికి ముందు, అందులో నిజానిజాలేంటో తెలుసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత సదరు వ్యక్తులకు ఉంటుందని అన్నారు.

కనీసం ఎలాంటి అవగాహన లేకుండా తమకు ఎలా నచ్చితే ఆలా వార్తలు రాయడం సరికాదని అన్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్‌.

తప్పుడు వార్తలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం సరికాదని చెప్పారు ఆమె.