అమీజాక్సన్ పెళ్లికి... కొడుకు ఒప్పుకున్నాడా?
TV9 Telugu
24 March 2024
అమీజాక్సన్ పేరు వినగానే మనకు శంకర్ హీరోయిన్ అని గుర్తుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె ఎంగేజ్‌మెంట్ అయింది.
బ్రిటిష్ మీడియాలో పాపులర్ అయిన యాక్టర్ ఎడ్‌వెస్ట్ విక్‌ని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు అమీజాక్సన్.
వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ డిన్నర్ పార్టీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అమీ జాక్సన్‌కి ఆల్రెడీ ఆండ్రియాస్ అనే కొడుకున్నాడు.
ఎక్స్ ఫియాన్సె జార్జ్ పనయియోతౌకి, అమీకి పుట్టిన కొడుకు ఆండ్రియాస్. తన పెళ్లికి ఆండ్రియాస్ ఒప్పుకున్నాడని చెప్పారు అమీ.
తన కొడుకుకి రెండేళ్లున్నప్పటి నుంచీ అతనితో ఎడ్‌తో పరిచయం ఉందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్ళికి దారితీసింది.
ఒకానొకసారి నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదమ్మా అని అడిగాడట ఆండ్రియాస్. ఎడ్‌ని పెళ్లి చేసుకోమ్మా అని కూడా చెప్పాడట.
అప్పటికి ఎడ్ తనకు ప్రపోజ్ చేయనేలేదని గుర్తుచేసుకుంటున్నారు అమీ జాక్సన్. ఎడ్, ఆండ్రియాస్, తానూ మంచి ఫ్రెండ్స్ అని అన్నారు.
వెడ్డింగ్ డీటైల్స్ ఇంకా రివీల్ చేయలేదు. కానీ, తన ఫ్యూచర్ మాత్రం ఎడ్‌తో అత్యంత అద్భుతంగా ఉంటుందని అంటున్నారు అమీ జాక్సన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి