మారు ఆలోచన లేకుండా కోటి విరాళం.. దటీజ్‌ ధనుష్ 

Phani.ch

15 May 2024

ప్రముఖ తమిళ నటుడు ధనుష్ ఇటీవల పలు కారణాలతో వార్తల్లో నిలుస్తున్నాడు . ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల విరాళమిచ్చాడీ స్టార్ హీరో.

కోలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీకి కోటి రూపాయల చెక్ అందించాడు ధనుష్ . ఏంటి? ధనుష్ ఇంత భారీ మొత్తం కార్తీకి ఎందుకు విరాళంగా ఇచ్చాడు? అనుకుంటున్నారా?

ఈ డబ్బంతా కళాకారుల కోసం! ఎస్ ! నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణానికి 1 కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు ధనుష్.

ఈ సందర్భంగా ఆయనకు నడిగర్ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇక ధనుష్ చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలిగిపోతున్నాడు.

ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక సినిమాలతో సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటాడీ హీరో.

అందుకు నిదర్శనంగా ఇప్పుడు కోటి రూపాయల విరాళం ఇచ్చాడు. దీనికి సంబంధించిన చెక్ ను కార్తీకి అందించాడు ధనుష్.

ప్రస్తుతం వీరిద్దరి కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ధనుష్ ఏమాత్రం ఆలోచించకుండా కోటి ఇవ్వడం గొప్ప విషయమే కామెంట్ కూడా ఆయన ఫ్యాన్స్‌ నుంచి వస్తోంది.