కత్తిలాంటి చూపులతో సెగలు పుట్టిస్తోన్న సైతాన్ హీరోయిన్..

Phani CH

07 June 2025

Credit: Instagram

దేవియాని శర్మ ప్రెసెంట్ యూత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ చిన్నది 2016లో హిందీ చిత్రం లవ్ శుదాలో చిన్న పాత్రతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె, 2019లో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించింది. 

2020లో వచ్చిన భానుమతి & రామకృష్ణ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం అందుకోలేకపోయింది.

కానీ ఈ సినిమాతో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత, రొమాంటిక్ (2021)లో ఆకాష్ పూరి స్నేహితురాలి పాత్రలో కనిపించి యువతను ఆకట్టుకుంది.

సైతాన్ వెబ్ సిరీస్ లో ఈ బ్యూటీ బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్స్. దీంతో ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో వెతకడం స్టార్ట్ చేశారు.

ఇటీవల ఓటీటీలో సూపర్ హిట్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో మోడ్రన్ ఐడియాలజీ ఉన్న భార్య పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. 

అటు బోల్డ్ క్యారెక్టర్ చేసిన దేవయాని.. ఇటు సేవ్ ది టైగర్స్ సిరీస్ లో మోడ్రన్ టచ్ చూసేసరికి అందరూ షాకయ్యారు. ఆ తర్వాత అనగనగా అనే వెబ్ సిరీస్ చేసి మెప్పించింది.