ఇది కదా పాట అంటే... యూట్యూబ్‌లో దూసుకుపోతున్న డెవిల్ సాంగ్
24 September 2023
ఓ పీరియాడిక్ సినిమా తీయడం అంత ఈజీ కాదు... అప్పటి లోకాన్ని, పరిస్థితులను.. రీక్రియేట్ చేయడం అంత ఆశామాషీ కాదు.
ఒకవేళ.. రీ క్రియేట్ చేసినా.. ఆనాటి సౌండింగ్‌ను ఇవ్వడం అనేది పెద్ద ఛాలెంజ్‌తో కూడుకున్న విషయం. అయితే ఇందులోనే.. తాజాగా సక్సెస్ అయ్యారు డెవిల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ద్వయం.
ఎస్ ! అభిషేక్ నామా ప్రొడక్షన్స్‌లో కళ్యాణ్ హీరోగా..తెరకెక్కిన పీరియాడికల్ ఫిల్మ్ డెవిల్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా 'మాయ చేశావే' సాంగ్ రిలీజ్ అయింది.
ఎట్ ప్రజెంట్ యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే ఈ సాంగ్‌లోని వింటేజ్ ఫిల్ ఈ సాంగ్ గురించే అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.
అయితే ఇంతలా అందర్నీ ఆకట్టుకుంటోన్న ఈ సాంగ్ కు ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఇంస్ట్రుమెంట్స్ వాడారనే ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్,
సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు.
ఈ తాజా న్యూస్ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ సాంగ్‌లోని వింటేజ్ ఫీల్‌ను.. పదే పదే ఫీలయ్యేలా చేస్తోంది.