TV9 Telugu

21 January 2024

కం బ్యాక్ ఇవ్వనున్న దేవీ శ్రీ ప్రసాద్.! ఇక రచ్చ రచ్చే.

దేవీ శ్రీ ప్రసాద్ గతంలో మాదిరి ఎందుకు వరస సినిమాలు చేయడం లేదు..?

అనిరుధ్, థమన్ ధాటికి ఆయన జోరు తగ్గించారా లేదంటే కొడితే కుంభస్థలమే అనేలా తన టైమ్ కోసం వేచి చూస్తున్నారా.?

ప్రస్తుతం దేవీ ఎన్ని సినిమాలు చేస్తున్నారు.? మునపట్లా మళ్లీ నెంబర్ వన్ ప్లేస్‌కు వచ్చే ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయా.?

అసలు DSP ఫ్యూచర్ ప్లాన్ ఏంటి.? కొన్నేళ్లుగా దేవీ పేరు పెద్దగా కనిపించడం లేదు..ఆయన పాటలు కనిపించట్లేదు.

ఈ ఇయర్ మాత్రం గ్రాండ్‌గానే ప్లాన్ చేస్తున్నారు DSP. ఓ వైపు అల్లు అర్జున్ పుష్ప 2.. మరోవైపు చందూ మొండేటి తండేల్..

ఇంకోవైపు ధనుష్, శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సైతం దేవీ చేతిలోనే ఉంది. ఇదెప్పుడు మొదలవుతుందో తెలీదు కానీ..

ఎప్పుడు మొదలైనా మోత మోగించడం మాత్రం ఖాయం. వీటితోనే తన ప్లేస్ మళ్లీ వెనక్కి తెచ్చుకుంటున్నారంటున్నారు దేవీ.