ఎన్టీఆర్ న్యూ లుక్.. డబుల్ ఇస్మార్ట్ ముచ్చట..

TV9 Telugu

23 March 2024

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ ఇందులో కథానాయకిగా నటిస్తుంది.

ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుందిప్పుడు. తాజాగా సినిమా నుంచి ఓ స్టిల్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

దర్శకుడు కొరటాల, కొరియోగ్రఫర్ రాజు సుందరం మాస్టారుతో కలిసి తారక్ ఇచ్చిన పోజు వైరల్ అవుతుంది. సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది.

ఓం భీమ్ బుష్ సినిమా మీద శ్రీవిష్ణు నమ్మకం మాములుగా లేదు. అనుకోనట్లుగా హిట్ కూడా కొట్టేసారు ఈ యంగ్ హీరో.

ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త పాయింట్ తీసుకున్నామని, లాజిక్స్ వదిలేసి చూస్తే హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని ఆయన చెప్తున్నారు.

సినిమాపై ఉన్న నమ్మకంతో ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ కూడా వేసారు దర్శక నిర్మాతలు. మార్చ్ 22న ఈ సినిమా విడుదల అయింది.

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.

ముందు మార్చిలోనే సినిమా విడుదలకు ప్లాన్ చేసినా.. షూటింగ్ ఆలస్యం కారణంగా 14న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్.