ఆ తీర ప్రాంతానికి దేవర ప్రయాణం.. నెక్స్ట్ స్టాప్ ఎక్కడ..
01 నవంబర్ 2023
ట్రిపుల్ ఆర్‌లో గోండు బెబ్బులి కొమరం భీమ్‌గా తారక్ చేశారన్నది నిన్నటి మాట. లేటెస్ట్ గా తారక్ ఫ్యాన్స్ అందరినీ ఊరిస్తున్న టైటిల్ పేరు దేవర.
రూత్‌లెస్ విలన్లు అందరికీ, టెర్రర్ పుట్టించే వ్యక్తి పేరే దేవర. తారక్ టైటిల్ కేరక్టర్‌లో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
జనతా గ్యారేజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. దేవర సినిమాలో సాగరతీరంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట.
కటిక చీకటిలో అలల హోరులో జరిగే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు చాలా కీలకం. ఇప్పుడు అలాంటి సన్నివేశాలనే గోవాలో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
ఇటీవలే శంషాబాద్‌లో వేసిన సెట్లో అండర్‌వాటర్ సీక్వెన్స్ తెరకెక్కించారు మేకర్స్. ఈ సీక్వెన్స్ కోసం తారక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.
దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో దేవరను రూపొందిస్తున్నారనే వార్తలూ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి.
గోవా షెడ్యూల్ పూర్తయ్యాక గోకర్ణలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఈ షెడ్యూల్‌లోనూ జాన్వీ కపూర్ పార్టిసిపేట్ చేస్తారు.
ప్రస్తుతానికైతే తారక్ ఫుల్ ఫోకస్ దేవర మీదే ఉంది. ఈ సినిమా పూర్తయ్యాకే వార్ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టాలన్నది తారక్ ఆలోచన.
ఇక్కడ క్లిక్ చెయ్యండి