త్వరలో దేవర అప్‌డేట్.. హిందీలో బంధీ చిత్రం..
27 December 2023
TV9 Telugu
వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ సంక్రాంతి రోజు రిలీజ్ చేయబోతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఒకే ఒక క్యారెక్టర్‌తో తెరకెక్కిన లేటెస్ట్ టాలీవుడ్ చిత్రం బంధీ. ఇది ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో వస్తుంది.
కంటెండ్ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు ఆదిత్య ఓం ఈ సినిమాలో ప్రధాన పాత్ర నటించారు.
తిరుమల రఘు దర్శకత్వంలో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంటెన్స్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు బందీ సినిమా మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి