చీరలో నవ్వుల చిరు జల్లు కురిపిస్తున్న దీప్తి..
16 November 2023
1998 నవంబర్ 10న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ దీప్తి సునైనా.
దీప్తి రెడ్డి ఈమె అసలు పేరు. ప్రస్తుతం ఆర్ట్స్‌లో డిగ్రీ చదువుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నటిగా ఎదగాలని ఈ బ్యూటీ కోరిక.
తన తల్లిదండ్రులు, సోదరి, సోదరుడుతో తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో నివసిస్తుంది అందాల తార దీప్తి సునైనా.
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ఐదు ఏళ్ళు రిలేషన్ షిప్ ఉంది. 1 జనవరి 2022న అతనితో విడిపోయినట్లు ప్రకటించింది.
సోషల్ మీడియా ద్వారా డబ్‌స్మాష్ వీడియోలను పోస్ట్ చేస్తూ తన కెరీర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రజాదరణ పొందింది.
2018లో నిఖిల్ హీరోగా రూపొందిన తెలుగు సినిమా ‘కిర్రాక్ పార్టీ’తో సినీ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
2018లో ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 2’ కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకు మరింత చేరువైంది.
స్టార్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్ లకు వీరాభిమాని ఈ వయ్యారి. 2018లో బ్లూమ్‌బెర్గ్ న్యూ ఇయర్ ఈవెంట్‌లో ఆమె ప్రదర్శన ఇచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి