ఆ అందానికి.. ఆ ఫేస్ కట్‌కి మనం ఇచ్చే వ్యాల్యూ ఎంతండీ..!

Rajeev 

21 May 2024

 సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ముద్దుగుమ్మలు ఫెమస్ అయ్యారు. వీరిలో దీప్తి సునైనా ఒకరు. 

ఈ అమ్మడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ అభిమానులను సొంతం చేసుకుంది. 

ఆతర్వాత ఈ బ్యూటీ బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొంది. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. కానీ సినిమాల్లో ఛాన్స్ లు అందుకోలేకపోయింది. 

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమాయణం ఆతర్వాత బ్రేకప్ తో ఆమధ్య వార్తల్లో నిలిచింది దీప్తి సునైనా. 

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. 

కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన దీప్తి సునైనా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

ఈ మధ్య కాస్త గగ్లామర్ షో కూడా మొదలు పెట్టింది. వయ్యారాలు వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది దీప్తి. 

తాజాగా బ్లాక్ కలర్ డ్రస్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు వీటిపై.