క్యూట్ లుక్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తున్న దీపికా పిల్లి..
19 September 2024
Battula Prudvi
15 ఏప్రిల్ 1999న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విజయవాడలో ఓ తెలుగు హిందూ కుటుంబంలో జన్మించింది దీపికా పిల్లి.
2018లో టిక్‌టాక్‌లో లిప్-సింక్ వీడియోలు చేయడం ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది.
2020 నాటికి తన వీడియోలతో టిక్‌టాక్‌లో దాదాపు 10 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ను సంపాదించుకుంది ఈ వయ్యారి భామ.
టిక్‌టాక్ నిషేధం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ప్రారంభించింది. 2024 నాటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్లకు పైగా ప్రజలు ఆమెను ఫాలో అవుతున్నారు.
2021లో తన తొలి రియాలిటీ టీవీ షో ‘ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ రష్మీ గౌతమ్‌తో కలిసి ‘క్వీన్’ టీమ్‌కి లీడర్‌గా కనిపించింది.
2022లో స్టార్ మాలో ప్రసారమైన కామెడీ టెలివిజన్ షో ‘కామెడీ స్టార్స్ ధమాకా సీజన్ 2’కి ఆమె హోస్ట్‌గా వ్యవహరించింది.
అదే ఏడాది తెలుగు హాస్య చిత్రం ‘వాంటెడ్ పాండుగాడ్’లో సుడిగాలి సుధీర్ కి జోడిగా నటించింది ఈ అందాల భామ.
2023లో OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో ప్రీమియర్ అయిన కామెడీ టీవీ షో ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’లో హోస్ట్‌గా కనిపించింది.