TV9 Telugu

గుడ్ న్యూస్ చెప్పిన దీపికా.. ఇలియానా రీ ఎంట్రీ..

02 March 2024

దీపికా పదుకునే తల్లి కాబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీన్నే నిజం చేసారు ఈ భామ.

తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలకు ముగింపు పలికారు దీపిక, రణ్‌వీర్ జోడీ. తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త రణవీర్ సింగ్‌తో ఉన్న ఫోటోను సెప్టెంబర్ 2024 అంటూ పోస్ట్ చేసారు.

రీసెంట్ మలయాళ సర్వైవల్‌ థ్రిల్లర్‌ బ్లాక్ బస్టర్‌ మంజుమ్మెల్‌ బాయ్స్ రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా 40 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది.

ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్ అవుతుండటంతో 50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. చిదంబరం దీనికి దర్శకుడు.

లాల్‌ సలాం సినిమాతో దర్శకురాలిగా ఆకట్టుకున్న ఐశ్వర్య రజనీకాంత్‌, మరో ఇంట్రస్టింగ్ మూవీకి రెడీ అవుతున్నారు.

మల్టీ టాలెంటెడ్ స్టార్‌ సిద్ధార్థ్ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు ఐశ్వర్య. ఇప్పటికే కథ విన్న సిద్ధార్థ్ ఫుల్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేయమన్నారు.

మెటర్నిటీ బ్రేక్ తరువాత రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు ఇలియానా. సందేశాత్మక కథతో తెరకెక్కిన 'తేరే క్యా హోగా లవ్లీ' అనే డిఫరెంట్ మూవీతో వస్తున్నారు.

బల్వీందర్‌ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.