11 April 2024
17 ఏళ్ల వయసులోనే ఆ సాహసం చేసిన దీపికా.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొణే ఒకరు. షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాతో కథానాయికగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తొలి సినిమా ఆఫర్ వచ్చే వరకు చాలా కష్టపడాల్సి వచ్చిందని.. తనకు ఉండేందుకు చిన్న గది లేదని.. అందుకే ఎక్కువగా సెట్స్‌లో లేదా ఆరు బయటే ఎక్కడో గడిపేదట
నటిగా మారాలని 17 ఏళ్ల వయసులోనే ముంబైకి ఒంటరిగా బయలుదేరానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ వయసులో తను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అదే.
కానీ ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తే.. ఆ నిర్ణయం ఎలా తీసుకున్నాను ?.. ఆ సమయంలో అంత పెద్ద నిర్ణయం ? అనేది గ్రహించలేకపోయిందట.
దీపికా తండ్రి మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాష్ పదుకొణె. తన కుమార్తె నిర్ణయం కరెక్ట్ అని అంగీకరించారు. ముంబైకి ఒంటరిగా వెళ్లనివ్వడం సాహసమే అన్నారు.
దీపికా 17 ఏళ్ల వయసులోనే ముంబై వెళ్లడం చూసి చాలా భయాందోళనకు గురయ్యామని .. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తను చేసింది సరైన పని అన్నారు.
ఎందుకంటే సినీ పరిశ్రమలో నటిగా తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎవరైనా సరే ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని అని ప్రకాష్ పదుకొణె అన్నారు.
దీపికా తన తల్లిదండ్రుల భయాన్ని, ఆందోళనను అర్థం చేసుకున్నట్లు తెలిపింది. అప్పట్లో అది చాలా ముఖ్యమైన నిర్ణయమని.. అందుకే ఆ వయసులో పెద్ద సాహసమన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.