TV9 Telugu
కష్టమే... అయినా ఇష్టమే అంటున్న దీపిక!
06 March 2024
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ గురించి రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది ఫిల్మీ సర్కిల్స్ లో.
మొన్న మొన్నటిదాకా ఆమె సినిమా ప్రమోషన్లకు వస్తారా? రారా? అని సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరిగింది.
దానికి ఫుల్‌స్టాప్ పడ్డాక, ప్రభాస్ కల్కి సినిమాలో ఆమె కేరక్టర్‌కి ఎవరు డబ్బింగ్ చెబుతారు? అనేది చర్చ.
ఎవరో ఎందుకు? సినిమాలో నా డబ్బింగ్ నేనే చెబుతాను అని అంటున్నారట బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపిక పదుకోన్.
ఆమె మాతృభాష కొంకణి. కన్నడ కూడా బాగానే వచ్చు. అందుకే తెలుగు మాట్లాడటం సులభం అవుతుంది కాబట్టి, డబ్బింగ్ తానే చెప్పుకుంటానని అన్నారట.
పైగా సినిమాలో దీపికకు పేజీల కొద్దీ డైలాగులు ఉండవట. కాస్త కష్టపడితే, ఇష్టంగా డబ్బింగ్ చెప్పుకోవచ్చన్నది దీపిక నమ్ముతున్న విషయం.
ప్రస్తుతం ఎడిటింగ్ జరుగుతోంది. ఇది పూర్తవగానే, దీపికకు వాయిస్ టెస్ట్, తెలుగు మాడ్యులేషన్ టెస్ట్ చేస్తారు.
ప్రాజెక్ట్ కి ఆమె గొంతు సూటవుతుందని అనిపిస్తే, వెంటనే కల్కి డబ్బింగ్ చెప్పడం షురూ చేసేస్తారు ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి