సూపర్‌ స్టార్‌ దీపికా పడుకోణె.. 100 మంది సెలబ్రిటీస్ లో తానే నెం.1

Anil Kumar

31 May 2024

బాలీవుడ్ ముద్దుగుమ్మ "దీపికా పడుకోణె" క్రేజ్‌ ఒక్కసారిగా అమాంతం పెరుగుతోంది.. ఎందుకు అనుకుంటున్నారా.?

బీ టౌన్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో మొదటి ప్లేస్‌లో ఉండే బ్యూటీ దీపికా పదుకొణె.. ఎన్నో విజయాలను చూసింది.

తనదైన శైలితో.. గ్లామర్ గేట్లు ఎత్తేసి.. వినూత్నమైన తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ అమ్మడు.

ఈమె నటనకు.. గ్లామర్ కు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్న సంగతి తెలిసిందే.. అలంటి దీపికా మరిఘనత అందుకున్నారు.

బాలీవుడ్‌ లో బడా ఖాన్స్ నీ, సౌత్‌ స్టార్స్ నీ కూడా మించిన క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు దీపికా పడుకోణె.

2014 నుంచి 2024 వరకు అత్యధికంగా జనాలు చూడాలనుకున్న ఇండియన్‌ స్టార్స్ లిస్టులో బెస్ట్ ప్లేస్‌ కొట్టేశారు దీపికా పడుకోణె.

టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లో.. పేజ్‌ వ్యూస్‌ని ఆధారంగా చేసుకుని ఐఎండీబీ ఈ విషయాన్ని వెల్లడించింది.

త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్ దీపిక ప్రస్తుతం ఈ గుడ్‌న్యూస్‌ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు..