అమ్మయ్యేది అప్పుడే..డెలివరీ డేట్ చెప్పేసిన దీపిక

TV9 Telugu

16 June 2024

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిందామె.

ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది దీపికా. అలాగే కుటుంబ సభ్యులతోనూ సరదాగా గడుపుతోంది.

ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఇంటరాక్ట్‌ అయింది దీపికా పదుకొణె.

ఈ సందర్భంగా తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుందీ అందాల తార.

ఇప్పుడు తాను కోరింది తింటున్నానంటూ, తాను ఎంత తింటే తన బేబీకి అంత మంచిదని డాక్టర్‌ చెప్పారంది దీపిక.

అయితే బయటి ఫుడ్‌ మాత్రం తినడంలేదంటూ, చక్కగా ఇంట్లో చేసుకునే తింటున్నానంటోంది దీపికా పదుకొణె.

డెలివరీ సెప్టెంబర్‌లో ఉంటుందని డాక్టర్‌ చెప్పారని, కొంచెం టెన్షన్‌గా ఉంది’ అంటూ చెప్పుకొచ్చిందీ స్టార్ హీరోయిన్.

కాగా ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2898 AD సినిమా జూన్ 27న గ్రాండ్ గా విడుదల కానుంది.