నా దేశం ఇండియా.. దీనిని విడిచి నేనేందుకు వెళ్లాలి: దీపిక

15 November 2023

ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీస్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది దీపికా పదుకొణె

ఇటీవలే జవాన్‌ సినిమాతో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌ కల్కి 2898 ఏడీలో నటిస్తోంది

ఫైటర్‌ లాంటి భారీ ప్రాజెక్టులోనూ నటిస్తోంది. తాజాగా తన ప్రొఫెషనల్‌ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది దీపిక

' నువ్వు ఇక్కడ ఉంటే ఎదగలేవు. ప్యారిస్‌, న్యూయార్క్‌, మిలన్‌ వెళ్లిపో. బాగా స్థిరపడతావు’ అన్నారట  చాలా మంది దీపికతో 

 అప్పుడు 'నా దేశం ఇండియా. దీన్ని వదిలి నేనెందుకు వెళ్లాలి?' అని వారికి ఆన్సర్‌ ఇచ్చిందంట ఈ అందాల తార

గ్లోబల్‌ స్టార్‌గా ఎదగాలంటే.. వేరే దేశానికి ఎందుకు వెళ్లాలనే ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ దొరకలేదంటోంది దీపిక