10 ఏళ్ల.. 7000 కోట్లు.. దీపికా సత్తా.. 

Battula Prudvi 

30 August 2024

పాన్ ఇండియా హీరోలు 1000 కోట్ల సంధించడం సహజమే. కానీ దీపికా పదుకొనే హీరోయిన్‎గా 10 ఏళ్లలో 7000 కోట్లు కొల్లగొట్టింది.

2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడిలో సుమతి అనే పాత్రల్లో ఆకట్టుకుంది దీపికా. ఇది 1100 కోట్లు భారీ వసూళ్లు చేసింది.

ఈ ఏడాది దీపికా కథానాయకిగా వచ్చిన ఫైటర్ సినిమా ఆశించిన విజయం సాదించలేకపోయినప్పటికీ 337 కోట్లు వసూళ్లు అందుకుంది.

గత ఏడాది షారుక్ ఖాన్ సరసన రెండు సినిమాలు చేసింది ఈ బ్యూటీ. పఠాన్ 1148, జవాన్ 1050 కోట్లు కొల్లగొట్టాయి.

2018లో దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా పద్మవత్. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద 572 కోట్లతో సత్తా చాటింది.

2017లో వచ్చిన అమెరికన్ చిత్రం 'XXX: రిటర్న్ ఆఫ్ క్సాండర్' కేజ్ ఓ పాత్రలో కనిపించింది. ఇది 2600 కోట్లు వసుళ్లు చేసింది.

2015లో భాషా పురాణ చారిత్రక రొమాంటిక్ చిత్రం బాజీరావ్ మస్తానీలో ఫిమేల్ లీడ్‎లో నటించింది దీపికా. ఇది 356.2 కోట్లు కొట్టింది.

2014లో హీస్ట్ కామెడీ థ్రిల్లర్ చిత్రం హ్యాపీ న్యూ ఇయర్‎లో కథానాయకిగా కనిపించింది ఈ భామ. ఇది 408 కోట్లతో సత్తా చాటింది.