దీపిక డెడికేషన్‌కు.. చేతులెక్కి మొక్కుతున్న సెలబ్రిటీస్‌.

Anil Kumar

21 June 2024

దీపికా పడుకోణె డెడికేషన్‌ చూసి ఇప్పుడు బాలీవుడ్ జనాలు.. సెలబ్రిటీలు ఆమెకు చేతులెక్కి మొక్కుతున్నారు.

ఇచ్చిన కమిట్మెంట్‌కు కట్టుబటి.. తను ప్రెగ్నెంట్‌ అయ్యి కూడా.. సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ..

ప్రభాస్ కల్కి ప్రమోషన్స్‌కు కూడా డుమ్మా కొట్టకుండా.. ఎక్స్‌క్యూజెస్ చెప్పకుండా ఆ మూవీ టీం తో వచ్చింది.

బేబీ బంప్‌తోనే.. ముంబయ్‌లో జరిగిన కల్కి ప్రమోషనల్ ఈవెంట్ లో చాల హుషారుగా కనిపించి మెప్పించింది దీపికా.

ఆ ఈవెంట్లో సెంట్రాఫ్ అట్రాక్షన్ అవ్వడమే కాదు.. తన డెడికేషన్ తో బీ టౌన్‌ లో అందరి మన్ననలు పొందుతోంది.

ఇందులో  దీపిక ధరించిన సింపుల్ బ్లాక్ ట్రెండీ డ్రెస్ ధరించింది. ఆ డ్రెస్ ధర రూ.1.14 లక్షలు అని సమాచారం.

ఈ ఈవెంట్లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, కమల్ హాసన్, ప్రభాస్ పాల్గొనగా.. భల్లాలదేవ రానా కూడా మెరిశారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో కల్కి సినిమా వచ్చే వారం అనగా జూన్ 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.!