లగ్జరీ బిల్డింగ్ కొన్న దీపికా పదుకొణె
.. ధర తెలిస్తే షాకే
Phani CH
19 SEp 2024
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తాజాగా కల్కి సినిమాతో మరొక సారి ప్రేక్షకులను తన నటన
తో అలరించింది.
ఇది ఇలా ఉంటే వ్యక్తిగత జీవితపరంగా అన్ని కలిసి రావడంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని సమాచారం.
అయితే ఇటీవల పండంటి పాపకు జన్మనిచ్చింది దీపికా పదుకొణె. అయితే పాపా పుట్టాక కలిసి వచ్చిందన్నట్లు వరుసగా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు.
తాజాగా ముంబైలోని భారీ అపార్ట్‌మెంట్‌ను దీపికా పదుకొణె కొన్నారు. ఈ వార్త బాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతుంది.
ముంబైలోని బాంద్రా పశ్చిమ ప్రాంతంలో 1,845 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొన్నట్లు సమాచారం. ఈ అపార్ట్‌మెంట్ కోసం రూ.17.8 కోట్లతో కొన్నట్లు తెలుస్తోంది.
ఇది అత్యంత విలాసవంతమైన భవనంగా తెలుస్తోంది. ఎనార్మ్ నాగ్‌పాల రియాల్టీ సంస్థ ఈ భవనాన్ని హీరోయిన్‌గా విక్రయించినట్లు బాలీవుడ్ పరిశ్రమలో టాక్.
గతంలో తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ముంబైలోని బాలీవుడ్ బాద్‌షా నివాసం మన్నత్‌కు సమీపంలో రూ.100 కోట్ల విలువైన భవనం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చేయండి