21 September 2023

కూతురి సూసైడ్ లెటర్ -  విజయ్‌ ఆంటోని ఎమోషనల్ 

Pic credit - Instagram

కమర్షియల్ హీరోల్లా కాకుండా.. సామాజిక బాధ్యతో సినిమాలు చేసే అతి కొద్ది హీరోల్లో విజయ్‌ ఆంటోనీ ఒకరు.

తన సినిమాలతో ఎప్పుడూ ఏదో మెసేజ్ ఇస్తూ.. అటు కోలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్‌లోను స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు.

అలాంటి స్టార్ హీరో విజయ్‌ ఆంటోనీ.. తన కూతురి ఆత్మహత్యతో కుంగిపోయారు. బతికున్నా జీవచ్చవంలా మారిపోయారు.

ఇక ప్రస్తుతం 12th క్లాస్ చదువుతున్న విజయ్ ఆంటోని కూతురు మీరా.. డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకున్నారు.

తాజాగా మీర మరణానికి ఆత్మహత్యే కారణం అని తేల్చిన పోలీసులు.. ఆమె గదిలో సూసైడ్ లెటర్‌ను సంపాదించారు.

ఆ లెటర్‌లో.. ' I Love You all, I will Miss My Friends & Teachers. My Family Will Suffer Without me'అంటూ మీర రాసుకొచ్చారు.

ఇక మీరా రాసిన సూసైడ్ లెటర్‌ను చూసిన విజయ్ ఆంటోని.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఓ లేఖను విడుదల చేశారు. 

'నా బిడ్డ కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశానికి వెళుతోంది'..

'ఆమె నాతో మాట్లాడుతోంది.. తనతో పాటే నేనూ చనిపోయాను'అంటూ.. ఆ లేఖలో తన కూతురుపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచారు విజయ్ ఆంటోని.