స్టేడియంలో దాసరి జయంతి వేడుకలు.. వణికించే మహిళలు!
TV9 Telugu
11 April 2024
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా డైరక్టర్స్ డే వేడుకల్ని నిర్వహించనున్నారు.
ఇలా హైదరాబాద్ లోని ఓ స్టేడియంలో దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను నిర్వహించడం ఇదే మొదటి సారి.
దాదాపు 15 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని అన్నారు టాలీవుడ్ సినిమా డైరక్టర్ వీరశంకర్.
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సహ కుటుంబానాం అనే పేరును ఖరారు చేశారు.
చాలా మంచి కథతో సినిమా చేస్తున్నామని, ఎవరూ ఊహించని రీతిలో సాగుతుందని చెప్పారు మేకర్స్. కథకు తగ్గట్టు మంచి టైటిల్ కుదిరిందని అన్నారు.
దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సీరీస్ హీరామండి. ఈ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది.
వేశ్యావృత్తిలో ఉన్న కొందరు మహిళలు ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి, వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టించిన కథతో తెరకెక్కుతోంది.
ట్రైలర్‌లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మే 1న ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ఈ క్రేజీ వెబ్‌సీరీస్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి