TV9 Telugu

07 January 2024

సలార్ 2 పై హింట్ ఇచ్చిన డార్లింగ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి.

ప్రజెంట్ సలార్ సక్సెస్‌ను డార్లింగ్‌ ప్రభాస్‌, ఆ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.

తొలి భాగం సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే పార్ట్‌ 2 ఉండబోతుందన్న హింట్ ఇచ్చారు ప్రభాస్‌.

తొలి భాగంలో ఎక్కువగా ప్రభాస్‌ను సైలెంట్‌గానే ప్రజెంట్ చేసిన ప్రశాంత్‌ నీల్ సీక్వెల్‌లోనే అసలు యాక్షన్ చూపించబోతున్నారు.

ఆల్రెడీ సీక్వెల్‌ కథ సిద్ధంగా ఉందన్న ప్రభాస్‌ త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని వెల్లడించారు.

ప్రజెంట్‌ కల్కి, మారుతి సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అవి కంప్లీట్ అయ్యాకే సలార్ 2 చేస్తారని భావించారు.

కానీ లేటెస్ట్ అప్‌డేట్‌తో ఆ డౌట్స్‌కు ఫుల్‌స్టాప్‌ పడింది. సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు ప్యారలల్‌గా సలార్‌ 2కు రెడీ అవుతున్నారు డార్లింగ్‌.

వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేస్తామన్న క్లారిటీ ఇవ్వటంతో మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్.