డార్లింగ్ నెక్ట్స్‌ మూవీ ఇదేనా.?

25 June 2024

డార్లింగ్ ప్రభాస్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ బాహుబలి.. ఇప్పుడు కాస్త పాన్ ఇండియా హీరో ప్రభాస్.

విపరీతమైన సిగ్గుతో చిన్న సినిమాతో సినిమా కెరియర్ మొదలుపెట్టిన ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఐకాన్ అయ్యాడు.

ఇండియాలోనే కాదు యావత్ వరల్డ్ లో ప్రభాస్ పేరు మారుమోగిపోతుంది. బాహుబలి తనని ఆ రేంజ్ లో కుర్చోపెట్టింది.

ఎంత పాన్ ఇండియా హీరో అయినా తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్ ఎప్పుడు డార్లింగ్ నే.. ఇక అసలు విషయానికి వస్తే..

ప్రభాస్ చేస్తున్న సినిమాలు లైన్ లో ఉన్నాయి.. కల్కి కూడా రిలీజ్ అవుతున్న టైంలో.. ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై ఆసక్తి పెరిగింది.

ప్రభాస్‌తో తాను చేయబోయే సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు హను రాఘవపూడి.

ఈ సినిమా కథను ముందే రెడీ చేసినా.. ప్రభాస్‌ ఓకే చేసిన తరువాత ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా చాలా డెవలప్ చేశామన్నారు.

ప్రస్తుతం ప్రభా చేస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే హను మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఏ జోనర్ అనేది తెలియాలి.