ధనుష్‌, నాగ్ కంబోలో మూవీ.. గేమ్‌ ఆన్‌ నుంచి ట్రైలర్..

TV9 Telugu

22 January 2024

కోలీవుడ్ స్టార్ ధనుష్‌, కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్నారని ప్రకటించారు మేకర్స్. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన సినిమా గేమ్‌ ఆన్‌. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నారు.

సినిమా విడుదలకి తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

మంచి కథతో సినిమాను తెరకెక్కించామని, ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదని అన్నారు మేకర్స్. ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.

ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటిదాకా తెరకెక్కలేదని, ప్రేక్షకులకు నచ్చేలా ప్రతి ఫ్రేమూ ఉంటుందని చెప్పారు మేకర్స్.