ధనుష్, శేఖర్ కమ్ముల లుక్..  అక్కడ తండేల్ షూట్..

TV9 Telugu

11 March 2024

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లూక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో ఈ మూవీ టైటిల్ కూడా ప్రకటించింది చిత్ర యూనిట్.

ఈ సినిమాకి కుబేరా అనే టైటిల్ ఖరారు చేసారు మూవీ మేకర్స్. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

రష్మిక మందన్న హీరోయిన్. శేఖర్ కమ్ముల తన స్టైల్ కాకుండా మాస్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా కుబేర వస్తుంది.

కవిన్, అపర్ణ దాస్, మోనిక చిన్నకోట్ల ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా పాప. తమిళం బ్లాక్ బస్టర్ గా దా..దా.. సినిమాను తెలుగులో పా..పా.. గా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దీనికి ప్రముఖ దర్శకుడు త్రినాధ రావు నక్కిన ముఖ్య అతిథిగా వచ్చి ట్రైలర్ విడుదల చేసారు.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా తండేల్. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లోనే పాకిస్తాన్ జైలు సెట్ వేసి షూట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను అక్టోబర్ 11న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.