TV9 Telugu
వెంకీ మామ ఈజ్ బ్యాక్.! తన స్ట్రెంగ్త్ పై ఫోకస్ చేసిన వెంకటేష్.
07 April 2024
విక్టరీ స్టార్ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా నిరాశపరచడంతో తన నెక్ట్స్ సినిమా మీద ఫోకస్ పెట్టారు వెంకీ మామ.
తాను చెయ్యబోయే సినిమాకు హిట్ ఫార్ములాను రిపీట్ చేయాలని డిసైడ్ అయ్యారు అంట.! ఇంతకీ ఏంటదీ అనుకుంటున్నారా.?
వెంకీ మామ స్ట్రెంగ్త్ కామెడీ. ఆయన కామెడీ ఎంటర్‌టైనర్‌లుగా చేసిన సినిమాలు అన్ని మంచి విజయాలు సాధించాయి.
అందుకే తన నెక్ట్స్ సినిమాను అదే జానర్‌లో ప్లాన్ చేస్తున్నారు వెంకీ. అందుకే తన హిట్ డైరెక్టర్ ని లైన్లో పెట్టారు.
గతంలో ఎఫ్ 2 , ఎఫ్ 3 లతో మంచి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది.
దీని గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు అనే చెప్పాలి.
తాజాగా ఈ చిత్రంపై మరో అప్‌డేట్ వచ్చింది. ఉగాది సందర్భంగా సినిమాకు ముహూర్తం పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీ, అనిల్ కాంబోలో రానున్న మూడో సినిమా ఇది. దీనికి నిర్మాత కూడా దిల్ రాజ్ నే అట.
ఇక్కడ క్లిక్ చెయ్యండి