ముఖ్యమంత్రితో దగ్గుబాటి సోదరులు.. చిరును కలిసిన ఏఎం రత్నం..

TV9 Telugu

29 January 2024

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి సోదరులు సురేష్ బాబు, వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.

నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి హీరో వెంకటేష్, ప్రొడ్యూజర్ సురేష్ బాబులు ఆయనతో భేటీ అయ్యారు.

అయ‌న‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ రావడంపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంది.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మెగాసూర్య ప్రొడక్షన్ సంస్థ అధినేత, ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఏఎం రత్నం కూడా చిరును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడా కలిసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు ఏఎం రత్నం.