ముందు నుంచి చెప్తున్నట్లుగానే రామ్ పోతినేని, బోయపాటి శ్రీను స్కంద సినిమా సెప్టెంబర్ 28కి వాయిదా పడింది.
ఇదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసారు మేకర్స్. సెప్టెంబర్ 15న రావాల్సిన సినిమా సలార్ రిలీజ్ డేట్‌ను తీసుకుంది.
ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల, సయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమా 800. ఆయన టెస్ట్ క్రికెట్‌లో తీసిన 800 వికెట్లనే సినిమా టైటిల్‌గా పెట్టారు మేకర్స్.
ఈ చిత్రానికి ఎమ్మెస్ శ్రీపతి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్ లాంఛ్ వేడుక జరిగింది.
ఈ ట్రైలర్ లాంఛ్ వేడుకకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు సనత్ జయసూర్య, పా రంజిత్, వెంకట్ ప్రభు హాజరయ్యారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఖుషి. గతవారం విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.
తాజాగా ఈ సినిమా టైటిల్ వీడియో సాంగ్ విడుదల చేసారు మేకర్స్. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.