గేమ్ ఛేంజర్ షూటింగ్ పై క్రేజీ అప్‌డేట్.. ఫాన్స్ కి పండగే..
25 September 2023
అసలు గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. లాంగ్ బ్రేక్‌లో రామ్ చరణ్ మళ్లీ గేమ్ ఛేంజర్ సెట్‌కు వచ్చేదెప్పుడు..? కొత్త షెడ్యూల్ మొదలైందా లేదా..?
శంకర్ తీరు చూసాక.. చరణ్ అభిమానులు ఇదే పాట పాడుకుంటున్నారు కాకపోతే రకుల్‌లా రొమాంటిక్‌గా కాదు కాస్త చిరాగ్గా..!
చాలా రోజులుగా గేమ్ ఛేంజర్ షూటింగ్ జరగట్లేదు.. అప్‌డేట్స్ రావట్లేదు.. దిల్ రాజు సైతం నాకేం తెలియదు బాబోయ్ అంతా శంకర్‌నే అడగండంటూ చేతులెత్తేసారు.
ఇక రామ్ చరణ్ సైతం తన వారసురాలితో టైమ్ గడిపేస్తున్నారు. ఇన్నింటి మధ్య ఫ్యాన్స్‌కు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది.
ఇండియన్ 2 షూటింగ్ దాదాపు పూర్తైపోయింది. దాంతో ఇప్పట్నుంచి గేమ్ ఛేంజర్‌పైనే ఫోకస్ చేయనున్నారు ఈ దర్శకుడు.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో చరణ్‌తో పాటు కియారా అద్వానీ కూడా జాయిన్ అవుతున్నారు.
ఈ షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తి కానుందని తెలుస్తుంది. 2024 సెకండాఫ్‌లో గేమ్ ఛేంజర్ వచ్చే ఛాన్సులున్నాయి.
ఈ మధ్యే సాంగ్ లీక్‌తో సడన్‌గా ట్రెండింగ్‌లో వచ్చింది గేమ్ ఛేంజర్. లీక్‌పై నిర్మాతలు సీరియస్ అవ్వడమే కాదు.. లీగల్‌గానూ ప్రొసీడ్ అయ్యారు.
శంకర్ సినిమా చేస్తూనే.. డిసెంబర్ నుంచి బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టే ఆలచనలో ఉన్నారు చరణ్.
కుదిర్తే 2024లోనే గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు సినిమాలు రానున్నాయి.. అలా కుదరని పక్షంలో 2025 సంక్రాంతికి RC16 రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి