SSMB 29 నుంచి క్రేజీ అప్డేట్..
TV9 Telugu
18 April 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.
SSMB 29గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ లో బిజీగా ఉంది. అన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.
జనవరిలోనే రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పూర్తిచేశారు. దాదాపు ₹1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని టాక్.
ఇది అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనున్నట్టు గతంలో దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.
త్వరలోనే సినిమాను ప్రారంభించనున్నారు మేకర్స్. ఉగాదికి పూజ కార్యక్రమాం జరగనున్నట్లు వార్తలు వచ్చిన అది జరగలేదు.
ఇప్పడు దీని రెగ్యులర్ షూటింగ్‌ని జూన్ తర్వాత ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే అంతకన్నా ముందు, ఈ సినిమాకి సంబందించిన కాన్సెప్ట్ టీజర్‌ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట జక్కన్న.
దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ మొదలుపెట్టేశారని టాక్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి