సలార్ టీజర్ మేనియా ముగియకముందే 'ప్రాజెక్ట్‌-కె' నుంచి క్రేజీ అప్డేట్.. 

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'ప్రాజెక్ట్‌-కె'.

ప్రభాస్‌కి జోడిగా దీపికా పదుకొణె ఈ చిత్రాల్లో నటిస్తుంది.

అమితాబ్‌,కమల్‌ హాసన్‌, దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వైజయంతి మూవీ పథకంపై సి. అశ్వని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం సంక్రాంతి కనుక ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా సలార్‌ టీజర్‌తో ఫుల్‌ జోష్‌లో  ఉన్న ప్రభాస్‌ అభిమానులకు బిగ్‌  సర్‌ప్రైజ్‌ ఇచ్చారు 'ప్రాజెక్ట్‌-కె' మేకర్స్.

జులై 20న 'ప్రాజెక్ట్‌-కె' గ్లింప్స్‌ను  విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

అమెరికా జరిగే శాన్ డియాగోలో జూలై 19 నుంచి ప్రారంభం కానున్న కామిక్-కాన్ వేడుకలో ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్‌ చేయనున్నారు.

కాగా ప్రభాస్, కమల్‌,అమితాబ్‌, దీపికా, నాగ్ అశ్విన్ తదితరులు జులై 20న ఈ వేడుకలో పాల్గొననున్నారు.