05 July 2025
టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్.. సినిమాలు హిట్టైనా ఆఫర్స్ కరువు..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి.
తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రైక్ రాలేదు. దీంతో ఆఫర్స్ సైతం కరువయ్యాయి.
తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకున్న ఈ అమ్మడి పేరు ప్రియాంక జవాల్కర్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సివాలా సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీతో క్రేజ్ సొంతం చేసుకుంది.
మొదటి సినిమాతో ఎక్కువగా పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
ఆ తర్వాత పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ గుర్తింపు రాలేదు.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో సరైన ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. అనంతపురంకు చెందిన ప్రియాంకకు నెట్టింట యమ ఫాలోయింగ్ ఉంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆఫర్స్ అందుకోలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్