కోపంతో.. డైరెక్టర్ పేరు తొలగించిన ప్రొడ్యూసర్ - కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ.
17 September 2023
క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు.. డైరెక్టరే కదా..! కానీ ఆ క్యాప్టెన్నే తనకు కోపం తెప్పించాడని తీసేస్తా ఎలా ఉంటుంది.
తలే లేని మొండెంలా...! చాలా షాకింగ్‌గా ఉంటుంది. అయితే ఇదే షాకింగ్ థింగ్.. కళ్యాణ్ రామ్ మోస్ట్ అవేటెడ్ మూవీ..
డెవిల్ విషయంలోనూ జరిగింది. ఇక అసలు విషయం ఏంటంటే..!కళ్యాణ్ రామ్ హీరోగా.. డైరెక్టర్ నవీన్ మేడారం.. డెవిల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఆల్మోస్ట్ 80 పర్సెంట్ షూటింగ్ను కూడా కంప్లీట్ చేశాడు. కానీ ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ అభిషేక్ నామాతో.. డైరెక్టర్‌కు విభేదాలు రావడం...!
గతంలో అగ్రిమెంట్ లేకుండా.. డైరెక్టర్‌కు ఇచ్చిన కోటి రూపాయల్లో.. సగాన్ని వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ప్రొడ్యూసర్ చెప్పడంతో.. ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి.
సినిమాకు రెమ్యూనరేషన్గా తీసుకున్న ఆ అమౌంట్ ఇచ్చేదే లేదంటూ.. డైరెక్టర్ తేల్చి చెప్పడంతో.. తాజాగా డైరెక్టర్గా నవీన్ మేడారం పేరును తొలగిస్తూ..
డైరెక్టర్‌గా తన పేరును యాడ్ చేసుకుని.. నయా పోస్టర్స్ రిలీజ్ చేశారు అభిషేక్ నామా. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ చేసిన అనౌన్స్ మెంట్లో ఈ మార్పును చేశారు.
అయితే ఈ న్యూస్ పై డైరెక్టర్ నవీన్ మేడారం .. తన ఇన్‌స్టాలో స్పందించారు. ఓ బ్లాక్ ఎమ్‌టీ పిక్‌ను పెట్టి.. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ.. ఆ ఫోటో కింద రాసుకొచ్చారు.