TV9 Telugu
అవునా.! కల్కి రిలీజ్ డేట్ మారిందా.?
06 April 2024
వైజయంతి బ్యానర్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఏడి.
ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా మే 9 న విడుదల కానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పులు వచ్చాయని టాక్ వినిపిస్తున్న వైజయంతి నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు.
ప్రస్తుతానికి మే 9 ప్రకారమే బ్యాలన్స్ షూటింగ్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు కల్కి మే 13న ఎన్నికలు జరగనుండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మే 7న కూడా పన్నెండు రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ జరగనుందన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రిస్క్ అవసరమా అని..
సినిమాను వాయిదా వేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం సినిమా జూన్‌లో విడుదల కానుందని తెలుస్తుంది.
ఉగాది రోజు కల్కి సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అఫీషియల్ ప్రకటించనున్నారట మేకర్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో.?
ఇక్కడ క్లిక్ చెయ్యండి