డిసెంబర్ అంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్.. సలార్ కారణంగానేనా..

02 October 2023

డిసెంబర్ ఎప్పుడూ ఘనంగానే ఉంటుంది. క్రిస్మస్ సీజన్‌లో చాలా సినిమాలు పోటీ పడుతుంటాయి. అయితే ఈ సారి ముందు నుంచే ఆ పోటీ కనిపిస్తుంది.

డిసెంబర్ 1న రణ్‌బీర్ కపూర్, సందీప్ వంగా యానిమిల్ విడుదల కానుంది. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగులో దిల్ రాజు రైట్స్ తీసుకున్నారు.

ఇక డిసెంబర్ 7న హాయ్ నాన్నతో నాని వచ్చేస్తున్నారు. డిసెంబర్ 21న హాయ్ నాన్న విడుదల చేయాలనుకున్నా.. సలార్ రాకతో రెండు వారాలు ప్రీ పోన్ చేసారు మేకర్స్.

కొత్త దర్శకుడు శౌర్యు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్. నానితో పాటు నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా ఫస్ట్ వీక్‌లోనే రావాలని చూస్తుంది.

మరోవైపు డిసెంబర్ 8న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందే ఖర్చీఫ్ వేసాయి.

వెంకటేష్ సైంధవ్ డేట్ కూడా మారింది. కుదిర్తే డిసెంబర్ 13న వెంకీ బర్త్ డే కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు కానీ షూటింగ్ పూర్తి కాలేదు కాబట్టి ఆ డేట్ కష్టమే.

సుధీర్ బాబు హరోం హర సందిగ్ధంలో ఉంది. మరోవైపు డంకీ డిసెంబర్ 22నే వస్తుందని షారుక్ బల్లగుద్ధి చెప్తున్నారు.

దాంతో పాటు సలార్ వచ్చేస్తుంది. మొత్తానికి డిసెంబర్ రిలీజ్‌లపై పూర్తి క్లారిటీ రావడానికి మరో వారం రోజులు పడుతుంది.