17 December 2023

క్రేజీ కాంబో.. ప్రభాస్‌తో తమిళ్ స్టార్ కమెడియన్

తమిళ్ వాళ్లకే కాదు తెలుగు ప్రేక్షకులకు యోగిబాబు సుపరిచితుడే.. 

అయితే ఈ స్టార్ కమెడియన్.. తొందర్లో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. 

అది కూడా మన స్టార్ హీరో ప్రభాస్‌ పాన్ ఇండియా సినిమాలో...! 

ఎస్ ! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో యోగిబాబు నటిస్తున్నారట.

సలార్ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. 

హారర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో... కమెడియన్ యోగిబాబు కూడా నటిస్తున్నారట.

ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.