విడాకులపై క్లారిటీ ఇచ్చిన కలర్స్ స్వాతి
స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి అందరికీ సుపరిచితమే.
మా టీవీలో ప్రసారమయ్యే ‘కలర్స్’ అనే షోకి యాంకర్ చేసి తర్వాత ‘డేంజర్’ ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది.
‘అష్టాచమ్మా’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.
తర్వాత వికాస్ వాసుని ప్రేమ వివాహం చేసుకుని విదేశాలకి చెక్కేసింది.
కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు గత ఏడాది ‘పంచతంత్రం’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.
అయితే స్వాతి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యిందని. అందుకే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
గతవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మ్యారేజ్ ఫొటోలను వికాస్‌తో కలిసున్న పిక్స్ డిలీట్ చేసింది స్వాతి.
ఈ విషయం ప్రశ్నించగా.. ‘ఇప్పటికైతే అలాంటిది ఏమీ లేదు.. అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెబుతాను’ అంటూ ఆమె జవాబిచ్చింది.
అయితే ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉందని, విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించడం కూడా జరిగిందని సమాచారం.
అవి ఓకే అయితే ఈమె అధికారికంగా ప్రకటిస్తుందని .. నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి