సలార్ బాక్సాఫీస్ ఊచకోత.. సూర్య 43 కీలక అప్‌డేట్..
28 December 2023
TV9 Telugu
ప్రభాస్ హీరోగా నటించినమోస్ట్ అవెయిటెడ్ మూవీ సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.
అభిమానులు చాలా కాలంగా ప్రభాస్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలాగే చూపించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
మాస్ యాక్షన్ అవతార్‌లో ప్రభాస్‌ను చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 22న అర్ధరాత్రి 1:00 నుంచి థియేటర్లలో షోస్ పడ్డాయి.
తొలిరోజే భారీగా 178.7 కోట్లు వసూళ్లు చేసి ఈ ఇయర్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 5 రోజుల్లోనే 500 కోట్లు కొల్లగొట్టింది.
ప్రస్తుతం కంగువ సినిమా వర్క్‌లో బిజీగా ఉన్న సూర్య నెక్ట్స్ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ సూర్య విద్యార్థి నాయకుడిగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నజ్రియా ఫాహద్ హీరోయిన్.
ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. సూర్య, జ్యోతిక దంపతులు ఈ చిత్రానికి నిర్మాతలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి