31 December 2023

సలార్‌కు సీఎం రేవంత్‌ ఫిదా..

TV9 Telugu

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం లో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కించిన సలార్‌ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకెళుతోంది .

కనివినీ ఎరుగని కలెక్షన్లతో బాక్సాపీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. 

నాగ్‌పూర్‌లో  కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డికి అక్కడ సాదర స్వాగతం లభించింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసేందుకు సీఎం రేవంత్‌ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు

ఇక ఆ వీడియో బ్యాక్‌ గ్రౌండ్లో ప్రభాస్‌ సలార్‌ లోని సూరీడు సాంగ్‌ పెట్టారు.

అంతే కాదు.. సూరిగే గొడుగు పట్టి పాటలోని కొన్ని లిరిక్స్‌ను కూడా ట్వీట్‌లో జత చేశారు రేవంత్ రెడ్డి.

సలార్‌ పాట సీఎం రేవంతన్నకు కూడా నచ్చేసిందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.